- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టెంట్ సేవల ఆసుపత్రి..
దిశ, ఆర్మూర్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ ప్రారంభమైంది. నైన్ స్టార్ హెల్త్ కేర్, జీజీ చారిటీ, పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ (పీఆర్ఆర్) ఆధ్వర్యంలో సంయుక్తంగా హైదరాబాద్ లో బాగ్ లింగంపల్లిలో మంగళవారం ఆసుపత్రిని ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకెష్ రెడ్డి మాట్లాడుతూ తానుసంపాదించిన దాంట్లో కొంత పేదవారికి సహాయం చేయాలని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. సమాజంలో గల ఎందరో ధనవంతులు తన వల్లె ముందుకు రావాలని కోరారు. విద్య, వైద్యంకు ఎవరు ఇబ్బందులు పడకూడదని, అన్ని సదుపాయాలతో, అత్యాధునిక హంగులతో ఆసుపత్రి నిర్మించాం అన్నారు.
దేవుడు నన్ను ఎంతో అభివృద్ధి చేశాడని, తాను చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులతో వృద్ధిలోకివచ్చానని. తనకు వీలైనంతగా సమాజంలోని నిరుపేద ప్రజలకు ఏదో ఒక రూపేనా సేవాకార్యక్రమాలు చేస్తానన్నారు. తాను సంపాదించుకుని వృద్ధిలోకి వచ్చిన దాంట్లో నుంచి ప్రజలకు తిరిగి చేయాలనుకుంటున్నట్లు రాకేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవచేయడంతో పాటు నన్ను ఇంతగా ఆశీర్వదించి వృద్ధిలోకి తీసుకొచ్చిన దేవతామూర్తుల దేవాలయాల అభివృద్ధి ఇతర కార్యక్రమాలకు సైతం సాయం అందించి ఆ దేవుడి ఆశీర్వాదాన్ని మరింతగా పొందుకుంటానన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు అందేలా వీలైన వారందరూ సహాయంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రప్రజలందరూ ఒక్కరూపాయి డాక్టర్ కన్సల్టేషన్ తో వైద్యాన్ని వినియోగించు కోవాలని పైడి రాకేష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి, రాకేష్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులు, వైద్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.