- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులతో తమిళనాడు నీటిపారుదల శాఖ అధికారుల సమీక్ష సమావేశం…
దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు అతిథి గృహంలో మంగళవారం తమిళనాడు నీటి పారుదల శాఖ అధికారులు నీటి వినియోగపు సంఘం పై రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి వినియోగపు సంఘం ఉండేవని పేర్కొన్నారు. కాలక్రమేణా అవి మనుగడలో లేకుండా పోయాయని అన్నారు. ఈ సందర్భంగా గతంలో పని చేసిన నీటి వినియోగపు సంఘం రైతులతో అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించారు. అందుకు గాను రైతులు గతం మాదిరిగానే నీటి సంఘాలు ఉండాలని సూచించారు. ఈ సంఘం పని తీరు వివరించారు. అనంతరం తమిళనాడు నీటి పారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతుల వివరాలు సేకరించి నివేదికను ఉన్నత అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ చీప్ ఇంజనీర్ రాజు, కో ఆర్డినేటర్ జగన్ , పీఐఎం స్పెషలిస్ట్ నాగరాజు, ఎక్స్యూటివ్ ఇంజనీర్ మంగయార్కరసి, సుబ్బరాజ్, కార్తికేయన్, ఏడిఏ కే.సునీత, అన్నపూర్ణ, నీటిపారుదల శాఖ ఈఈ సొలోమన్, ఏఈ శివ ప్రసాద్ తమినాడు నీటి పారుదల శాఖ అధికారుల బృందం, రైతులు వెంకట్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గజ్జల కిరణ్, చిట్యాల రామకృష్ణ, గుమాస్తా శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.