డాక్టరేట్ పట్టా అందుకున్న.. ఆర్మూర్ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ 'పండిత్ వినీతపవన్'

by Geesa Chandu |
డాక్టరేట్ పట్టా అందుకున్న.. ఆర్మూర్ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీతపవన్
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లో విజ్ఞాన్ యూనివర్సిటీ నందు శనివారం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ (ఈసీ) డిపార్ట్మెంట్లో వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ (డబ్ల్యూఎస్ఎన్) రీసెర్చ్ ఏరియా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. పండిత్ వినీత పవన్ ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను నిర్వహించారు. ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మమకారంతో పిహెచ్ డి చేయాలనే పట్టుదలతో గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ తీసుకున్నారు. అదే విధంగా 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే అర్మూర్ మున్సిపల్ గ్రేడ్ -2 తొలి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఎన్నికయ్యారు. ఎన్నికైనా కొన్ని నెలల్లోనే పండిత్ వినీత పవన్ కి కాన్సర్ వ్యాధి రావడం కుటుంబ సభ్యులు, ఆర్మూరు ప్రజలు దిగ్భ్రాంతికి గూరయ్యారు. క్యాన్సర్ మహమ్మారిని సైతం లెక్కచేయకుండా ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో కాన్సర్ వ్యాధిని ఆమె జయించారు. ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ఆర్మూరు పట్టణ అభివృద్ధికి పాటుపడ్డారు. పండిత్ వినీతపవన్ మనోధైర్యంతో ముందుకు సాగాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆర్మూరు ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed