- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన బీఆర్ఎస్ పార్టీ పైన కేంద్రంలోని బీజేపీ పార్టీ బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా ? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం.. మీరే నా బలగం.. అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని పవర్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పునాదులు స్తంభాల్లాంటి వాళ్లు, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాము అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంను ప్రజల్లోకి తీసుకు వేళ్లాలని అన్నారు.
ప్రతిపక్షాలు బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలి అని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాం అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నుంచి 7 కోట్ల నిధులను సిసి రోడ్లు, డ్రైనేజీలు మహిళా సంఘాలు, కమ్యూనిటీ భవనాలు విద్యుత్ దీపాలకు కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య, వితంతు, బీడీ పెన్షన్లను ఎక్కడ లేని విధంగా ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటినుండి ప్రతి గ్రామాలలో బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న దృశ్ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని మతం పేరుతో విద్వేషాలు చేస్తున్న బీజేపీ పార్టీని ప్రతి గ్రామాలలో బొంద పెట్టాలి అని కార్యకర్తలకు తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా యువకులు నిబద్దతో పని చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలి. ముందు మీరు మంచిగా కష్టపడండి, కష్టపడేవారు ఎక్కడికెళ్లిన విజయం సాధిస్తారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న విట్టల్ రావు, ఐడీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాల చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక ఎంపీపీ బానోత్ అనుషాప్, జెడ్పీటీసీ బొల్లిలంక సుమలత, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, స్థానిక సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్, సొసైటీ చెర్మెన్ జితెందర్, పార్టీ సీనియర్ నాయకులు బాగరెడ్డి నూడా డైరెక్టర్ ముస్కే సంతోష్ , బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.