- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనుల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం
దిశ, ఆర్మూర్ : గిరిజనుల అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం రాహత్ నగర్, తాళ్లపల్లి గ్రామాలలో గురువారం అన్నపూర్ణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బంజారా, గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. పోడుభూముల పట్టాలు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకే ఇచ్చుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో
చేసిన ప్రతి పనిలో 30 శాతం కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు కలిసి నియోజకవర్గంలో యువతను గంజాయికి బానిసలుగా చేశాసారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి జాతీయ పసుపు బోర్డు కేటాయించడంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా అని ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు మెండోరా మండలం వెల్గటూరు తాండా యువకులు, కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు, పలువురు యువకులు అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, మండల అధ్యక్షులు ములిగే మహిపాల్, లింబాద్రి, సాయిరెడ్డి, తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.