- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలిమేల కుటుంబాన్ని ఒకటి చేసిన బలగం మూవీ..
దిశ, నిజామాబాద్ సిటీ: ఇటీవల దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూసర్స్ గా, (టిల్లు)వేణు ఎల్దండి డైరెక్టర్ గా, హీరో హీరోయిన్ దర్శిత్, కావ్య, సంగీతం బీమ్స్ సీసీరోలియో సమకూర్చిన సినిమా బలగం విడుదలైన విషయం విధితమే. కాగా ఈ సినిమా అంత గ్రామీణ వాతావరణంలో కొనసాగి, కుటుంబ నేపథ్యంతో ఉండటంతో అందరి మన్ననలు పొందుతుంది. ఈ సినిమాను అందరూ కుతుబంతో కలిసి చూస్తున్నారు. శనివారం దర్పల్లి మండల కేంద్రానికి చెందిన చెలిమేల వంశస్థులు దాదాపు 150కి పైగా పిల్లలు, పెద్దలు, వృద్ధులతో సహా అంతా కలిసి స్పెషల్ బస్సులో వచ్చి నిజామాబాద్ నగరంలోని వేణు మాల్ పీవీఆర్ లో బలగం సినిమాను చూశారు. సినిమా ఖర్చును చెలిమేల గంగాధర్ భరించగా, ఈ సినిమాతో చిన్న చిన్న విబేధాలు ఉన్న కలిసి ఉండాలని బలగం ఉంటేనే బలం ఉంటుందని చెలిమేల శ్రీనివాస్, రంజిత్, నవీన్, రాము, రాములు తెలిపారు. అందరితో కలిసి ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసినట్లు దిశతో పంచుకున్నారు.