పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి

by Sridhar Babu |
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్  కలిసి పని చేశాయి
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు కలిసి పని చేశాయని నిజామాబాద్ రూరల్ ఎం ఎల్ ఏ భూపతి రెడ్డి ఆరోపించారు. బుధవారం రూరల్ ఎంఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న క్రేజ్ ను చూసి ఎక్కడ ఓడిపోతామోనని బయపడి ఆ రేండు పార్టీ లు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు.

ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే పెద్దనోట్ల రద్దు విషయంలోబీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతు పలకడం, అలాగే మోడీ తిసుకొచ్చిన అనేక చట్టాలకు బహిరంగంగా, తెరవెనుక మద్దతు పలికారని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా ఎంపీ గా ఉన్న అరవింద్ పసుపు బోర్డ్ పేరు చెప్పి మాయ చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశ౦లో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed