- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భీంగల్ లో అత్యధిక వర్షపాతం నమోదు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం పరిశీలిస్తే.. జిల్లాలో అత్యధిక వర్షపాతం భీంగల్ లో 103.8 మి.మీలు నమోదు కాగా, నిజామాబాద్ రూరల్ మండలం పాల్దాలో, ఆర్మూరు మండలం పెర్కిట్ లో 0.5 మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో ఇతర చోట్ల నమోదైన వర్షపాతం ఇలా ఉంది..
నిజామాబాద్ సౌత్ మండలం నిజామాబాద్ లో 83.5 మి.మీలు, నిజామాబాద్ నార్త్ మండల కేంద్రంలో 73.3 మి.మీలు, కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ లో 61.3 మి.మీలు, నిజామాబాద్ నార్త్ మండలం గూపన్ పల్లిలో 59.5 మి.మీలు, మెండోరా మండల కేంద్రంలో 46.0 మి.మీలు, బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో 45.3 మి.మీలు, ఎడపల్లి మండల కేంద్రంలో 41.3 మి.మీలు, ఎడపల్లి మండలం జానకంపేటలో 36.5 మి.మీలు, నందిపేట మండలం చిన్న కొండూరులో 29.0 మి.మీలు, ఇందల్వాయి మండలం గన్నారంలో 28.0 మి.మీలు, బాల్కొండ మండల కేంద్రంలో 22.8 మి.మీలు, డొంకేశ్వర్ మండలం తొండకూర్ లో16.5 మి.మీలు, వేల్పూర్ లో 15.0 మి.మీలు, ముగ్పాల్ మండలం మంచిప్పలో 15.0 మి.మీలు, ఏర్గట్లలో 14.8 మి.మీలు, జక్రాన్ పల్లిలో 11.8 మి.మీలు, నవీపేటలో 11.3 మి.మీలు, మాక్లూరు మండలం మదనపల్లిలో 11.0 మి.మీలు, ముప్కాల్ లో 9.0 మి.మీలు, మోర్తాడ్ లో 8.3 మి.మీలు, ఆర్మూర్ మగ్గిడి లో 7.3 మి.మీలు, కమ్మర్ పల్లి, సాలూర మండల కేంద్రాల్లో 5.5 మి.మీల చొప్పున, సిరికొండ మండలం తూంపల్లిలో, డిచ్పల్లి మండలం కోరాట్ పల్లిలో, రెంజల్ మండల కేంద్రంలో 4.0 మి.మీల చొప్పున, మాక్లూరు మండలం లక్ష్మాపూర్ లో 1.8 మి.మీలు, నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా లో, ఆర్మూరు మండలం పెర్కిట్ లో 0.5 మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.