- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఐటిఐలో కాలిపోయిన పవర్ కంట్రోలర్...
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దశాబ్ధాల చరిత్ర కలిగిన నిజామాబాద్ ప్రభుత్వ ఐటిఐలో 20 రోజులుగా విద్యార్థులకు ప్రాక్టీకల్ తరగతులు జరుగడం లేదు. 20 రోజుల క్రితం అకాల వర్షాల సమయంలో పవర్ కంట్రోలర్లు కాలిపోయాయి. బాలుర ఐటిఐలో పవర్ కంట్రోలర్లు కాలిపోవడం, ఉన్న జనరేటర్ పని చేయకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టీకల్ తరగతులు కరువయ్యాయి. విద్యార్థులు ఐటిఐకి వస్తున్నా.. కేవలం థియరీ తరగతులకు పరిమితమయ్యారు. ఉపాధ్యాయుడు వచ్చినా విద్యార్థులు తరగతుల్లో థియరి పాటలు వినడం, మిగతా సమయాల్లో చెట్ల కిందనే గడిపి వెళ్లిపోతున్నారు. 20 రోజుల క్రితం పవర్ కంట్రోలర్లు కాలిపోవడంతో వాటిని మరమ్మత్తు చేసే యత్నాలు విఫలమయ్యాయి. దాంతో కొత్తవి బిగించేందుకు బడ్జెట్ లేక కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు ట్యూటర్లు ఏమి చేయలేక సతమతమవుతున్నారు.
ప్రభుత్వ ఐటిఐకి 2018 నుంచి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయినట్లు సమాచారం. 320 మంది విద్యార్థులు 11 ట్రేడ్ లలో శిక్షణ ఇచ్చే ప్రభుత్వ ఐటిఐలో కరెంట్ లేకపోవడంతో దానిని పునరుద్దరించేందుకు చందాలు వేసుకునేందుకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు ట్యూటర్లు ముందుకు వచ్చారు. వందల మంది విద్యార్థులు చదివే ఐటిఐలో కరెంట్ పునరుద్దరించుకోలేని పరిస్థితిలో బడ్జెట్ లేక సతమతమవుతున్నామని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ప్రాక్టీకల్ లేకపోతే ఐటిఐలో శిక్షణ అనేది ఉత్తదే అని చెప్పాలి. ఈ విషయంపై ప్రిన్సిపాల్ కోటిరెడ్డి మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం పవర్ కంట్రోలర్ కాలిపోయిన విషయాన్ని రాష్ట్ర అధికారులకు నివేదించామని తెలిపారు. బడ్జెట్ నిధుల కేటాయింపు ఆలస్యం కావడంతో స్వయంగా మరమ్మత్తులు చేయించుకుని తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం.