బల్దియా డ్రైవర్ పై ఫ్రూట్ షా‌పు నిర్వాహకుల దాడి

by samatah |   ( Updated:2023-03-14 06:59:52.0  )
బల్దియా డ్రైవర్ పై ఫ్రూట్ షా‌పు నిర్వాహకుల దాడి
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో మాలపల్లి హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్లో బల్దియా కార్మికులపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం హోల్సేల్ మార్కెట్ లోని చెత్తను తరలించేందుకు వచ్చిన టిప్పర్ లోడ్ నిండిపోవడంతో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. జస్వీర్ సింగ్ అనే టిప్పర్ డ్రైవర్ లోడ్ నిండడంతో వెళుతుండగా ఆంధ్ర ఫ్రూట్ హోల్సేల్ యజమాని అబ్దుల్ ఆహాద్ అతని తనయుడు వర్కర్లు కలిసి జస్వీర్ సింగ్ పై దాడి చేశారు. ఈ సంఘటనలు గాయాలయ్యాయి. విషయం తెలిసిన బల్దియా కార్మికులు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహించారు. దాంతో రంగ ప్రవేశం చేసిన ఎంఐఎం లీడర్లు కేసు కాంప్రమైజ్ చేసేందుకు యత్నించారు. బాధితుడు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్మికుడి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Next Story