- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం మాతో వెట్టి చాకిరి చేపిస్తుంది.. ఆశా వర్కర్లు
దిశ, నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం మహాత్మగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని ఆశా వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. గత 8 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం తమతో వెట్టి చాకిరి చేపిస్తుందని రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం పెంచి వెంటనే మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆశాలు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో గత 32 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతాలలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని సుమారు 28 వేల మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారన్నారు. రిజిస్టర్లు రాయడం, సర్వేలు చేయడం, ఆన్‌లైన్ పనులు చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నామని తెలిపారు.
తమ పట్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం అమానుషం అన్నారు. ప్రజలకు, గర్బిణీ, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తూ, కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారన్నారు. గతంతో పోల్చితే ఆశాలకు పనిభారం పెరిగిందని, పారితోషకాలు లేక అదనపు పనులు ప్రభుత్వం తమతో చేయించుకుంటుందని అన్నారు. ఇప్పుడు తమకు పారితోషకాలను రూ 18 వేలకు పెంచి ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు నస్రీన్, పార్వతి, రుక్మిణి, సాయవ్వ, నాగమణి, సావిత్రి, లలిత, మండలంలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.