- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ల నియామకం..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వం, బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నియామకం చేసినట్లు బిజెపి సభ్యత్వ నమోదు కన్వీనర్ పుప్పాల శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన కన్వీనర్ల వివరాలను బీజేపీ నాయకులు వెల్లడించారు. జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు సైతం నిజామాబాద్ జిల్లా సభ్యత నమోదు కన్వీనర్ గా బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. తనతో పాటు నిజామాబాద్ జిల్లా సభ్యత నమోదు సహా కన్వీనర్ లుగా రెంజల్ ఎంపీటీసీ సంతోష్ ను, నిజామాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్ ను, సవిత లను నియామకం చేసినట్లు చెప్పారు.
దీంట్లో భాగంగానే జిల్లాలోని ప్రతి అసెంబ్లీ లలో సైతం అసెంబ్లీ కన్వీనర్లను, సహ కన్వీనర్ల నియామకం చేయడం జరిగిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు కన్వీనర్ గా గంగోని సంతోష్ ను, సహ కన్వీనర్ గా జెస్సు అనిల్ కుమార్ ను, బాల్కొండ అసెంబ్లీ సభ్యత్వ నమోదు కన్వీనర్ గా నిమ్మల శ్రీనివాస్ ను, సహ కన్వీనర్ గా మల్కాజి మోహన్ ను, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ గా పద్మారెడ్డి ని, సహ కన్వీనర్ గా శ్రీనివాస్ గౌడ్ ను, బోధన్ అసెంబ్లీ సభ్యత్వ నమోదు కన్వీనర్ గా కూర్ల శ్రీధర్ ను, సహ కన్వీనర్లుగా నరసింహారెడ్డి, శ్రీకాంతులను నియామకం చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్టోబర్ 31 వరకు జరుగుతుందని, ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమం దృష్ట్యా గతంలో కన్న ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించడం కోసం కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ధ్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు సుంకరి రంగన్న, గంగోని గంగాధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్ కుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.