తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలు.. కాపాడాలని వేడుకుంటున్న ఇంటర్ విద్యార్థిని

by Vinod kumar |
తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలు.. కాపాడాలని వేడుకుంటున్న ఇంటర్ విద్యార్థిని
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినికి విషమ పరీక్ష ఎదుర్కుంటుంది. ఒక వైపు రోజు పరీక్షలు రాస్తునే దవాఖానాలో చికిత్స పొందుతున్న తండ్రి బాగోగులు చూసుకుంటుంది. తల్లి కాలం చేయగా తన అన్న కూలిపని చేస్తూ ఇంటి గడిచే పరిస్థితిలో తండ్రి దవాఖాన పాలవ్వడం, పరీక్షలు రావడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటుంది. రోజు బోదన్‌కు నిజామాబాద్‌కు రాకపోకలు చేస్తున్న చేతిలో చిల్లి గవ్వ లేదని సరైన వైద్యం చేసి తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి సాయిలు అనే వ్యక్తికి స్వప్న అనే ఇంటర్ చదువుతున్న కూతురు తో పాటు ఒక కొడుకు ఉన్నారు. భార్య ఆరు సంవత్సరాల క్రితం చనిపోగా తండ్రి, అన్నతో ఉంటూ ఇంటర్ చదువుతు పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా తండ్రికి అనారోగ్యం ఆమెను కుంగదీసింది. అన్న పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్న సమయంలో తండ్రి కి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఆస్పత్రి పాలవ్వడం వారిని ఆర్థికంగా, మానసికంగా కష్టాల్లోకి నెట్టింది. తండ్రి కి వైద్యం కోసం చెసిన అప్పులకు సరైన వైద్యం అందకపోవడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుంది.


తండ్రిని ఆసుపత్రిలో ఉంచి నిత్యం ఇంటర్ పరీక్షలకు హాజరు అవుతుండగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, గత నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదని, అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ఆసుపత్రులు తిరిగిన వ్యాధి నయం కావడం లేదని పేర్కొంది. అప్పులు తెచ్చి చికిత్స కోసం వెచ్చించిన డబ్బులు అన్ని అయిపోయాయా, ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నప్పటికీ నాలుగు రోజుల నుంచి సరైన చికిత్స అందించడం లేదని నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని సరిగా చూడడం లేదని పట్టించుకోవడం లేదని తన గోడును విన్నవించింది.

తన తండ్రి కి మెరుగైన చికిత్స అందించి కాపాడాలని వేడుకుంది. తన తండ్రి దమ్ము రోగం తో బాధపడుతున్నాడని అప్పుడప్పుడు దమ్ము ఆగిపోతుందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో భయాందోళన పరిస్థితిలో సతమతమవుతూ ఉన్నామని తమల్ని కాపాడాలంటూ కోరుతుంది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని ప్రస్తుతానికి యాంటి బయాటిక్ ఇచ్చామని కోలుకుంటున్నారు అని తెలిపారు. ఉపిరితిత్తులలో నీరు రావడం వలన ఈ పరిస్థితి ఉందని తెలిపారు.

Advertisement

Next Story