- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం రబీ సీజన్ పంటలను కొనుగోలు చేయాలి : ఏకేఎంఎస్
దిశ, ఆర్మూర్ : రబీ సీజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ నాయకుడు ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లో ఏకేఎంఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు రైతుల వారీగా నష్టాలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవడమే తప్ప రైతులకు సంక్షేమ పథకాలు అమలు జరిపేది మేమే అన్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. రైతుకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని, రైతుకు రెండింతల ఆదాయం తెచ్చి పెడతామని 2014 ఎన్నికల ప్రణాళికలో పేర్కొందన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడిచి పోయినప్పటికీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది తప్ప రైతు పండించిన పంటకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారెంటీ చట్టం వూసే లేదన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు గుప్పిట్లో పెట్టడానికి ప్రయత్నం చేసి రైతులు ఆందోళనకు తలవగ్గి తాత్కాలికంగా వెనక్కి తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిందే తప్ప అమలు చేసింది లేదని ఎద్దేవ చేశారు. వడగళ్ళ వానలో రైతు లక్షలాది రూపాయలు నష్టపోతే ముష్టి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్పలు చెప్పుకోవడానికి సబబా అని ప్రశ్నించారు. 33% రైతు నష్టపోతే తప్ప నష్ట పరిహారం ఇవ్వరాదని ఉన్న నిబంధనలు నేటికీ కొనసాగుతున్నాయని, ఆ నిబంధనలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పంటల బీమా పథకం అమలు జరపక నాలుగైదు సంవత్సరాలు అవుతుందన్నారు. కేంద్రం తెచ్చిన పంటల బీమా పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంకు ఇబ్బందికరంగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం సొంతగా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రీమియం కట్టి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సాగు దారు అందరికీ పట్టాలు ఇస్తానని కుర్చీ వేసుకుని సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఒక పట్టా ఇచ్చిన పాపన పోలేదు. 2005 అటవీ చట్టాన్ని అమలు జరిపి గిరిజనులు గిరిజన ఇతరులు అందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం కౌలు రైతులకు నేరుగా ముట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నందిరామయ్య సహాయ కార్యదర్శి సారా సురేష్, కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎస్.కె. గౌస్, సహాయ కార్యదర్శి ఎం.బిక్షం తదితరులు పాల్గొన్నారు.