నగల కోసం మహిళ దారుణ హత్య

by Naveena |
నగల కోసం మహిళ దారుణ హత్య
X

దిశ, భిక్కనూరు : పలు రకాలుగా మలుపులు తిరిగిన మర్డర్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. బంగారం కోసమే ఈ మర్డర్ చేశారని ఎంక్వైరీలో తేలినప్పటికీ, కరుడుగట్టిన పాత నేరస్తుడితో కలసి, హత్య కేసులో పాలుపంచుకున్న మరొకరు, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వాట్సాప్ గ్రూప్ లో వీడియో పోస్ట్ చేసి సూసైడ్ చేసుకోవడం కొత్త ట్విస్ట్. వివరాల్లోకి వెళితే..గత మూడు రోజుల క్రితం భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బాలెముల సుగుణ (55) తన వ్యవసాయ భూమిలో పాలకూర కోస్తుండగా..ఎలాంటి అనుమానం రాకుండా మర్డర్ చేసి,మెడలో ఉన్న బంగారు తాడును అపహరించుకుపోయారు. ప్రీ ప్లాన్ గా మర్డర్ చేయడంతో పోలీసులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. వివిధ కోణాల్లో పోలీసులు లోతైన విచారణ చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

ఆత్మహత్యతో బయటపడ్డ వైనం..

భిక్కనూరు సర్కిల్ పరిధిలోని యాడారం గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతనిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మొన్న కంచర్ల గ్రామంలో జరిగిన మర్డర్ కేసులో గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి అక్కడికి వెళ్లానన్నారు. తన పేరు ఎక్కడ బయట పడుతుందోనన్న ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదుర వ్యక్తి శనివారం ఉదయం చికిత్స పొందుతూ..మృతి చెందాడు. సూసైడ్ చేసుకున్న అతడు చాలాకాలంగా నిజామాబాదులో నివాసం ఉంటున్నాడు. వారం పది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడని తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో కలసి బైక్ పై కంచర్ల గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన పని అరగంటలో ముగించుకొని, మర్డర్ కు వాడిన వస్తువులను అదే బైక్ పై వెంటబెట్టుకొని వెళ్లారు.

ఆలయం వెనకాల పూడ్చిపెట్టారు...

సుగుణను మర్డర్ చేయడానికి వాడిన ట్రాక్టర్ బద్దిరాడుతోపాటు, ఇతర వస్తువులు బంగారాన్ని, గ్రామంలోని ఆలయం వెనకాల పూడ్చిపెట్టినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే మర్డర్ కు ప్రధాన సూత్రధారుడైన నిందితున్ని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. మర్డర్ చేసిన వ్యక్తి పై ఇదివరకే చాలా కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story