- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కు మద్దతుగా క్రైస్తవ మత పెద్దలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ర్ట ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం స్థాపించే జాతీయ పార్టీకి నిజామాబాద్ సీఎస్ఐ చర్చిలో ప్రతినిధులు మద్ధత్తు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో చర్చ్ అఫ్ సౌత్ ఇండియా, మెదక్ డయోసీస్ బిషప్ ఏసీ సోలమన్ రాజ్ మద్ధత్తు తెలుపుతున్నట్టు పెర్కోన్నారు. ఈ సంధర్బంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కేసీఆర్ వెంటే మేమంత ఉంటాం అన్నారు.
జాతీయ రాజకీయాలలోకి వెలుతున్న సీయం కేసీఆర్ కు దేవుడి ఆశీస్సులు ఉండాలి అన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరం ఉందని, సెక్యులర్ దేశంగా భారత దేశం ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందన్నారు. మతతత్వ పార్టీలతో దేశానికి ముప్పు ఉందని, దేశ రక్షణ కోసం మనమంతా కలిసి ఉండాలని కోరారు. తెలంగాణ క్రైస్తవులు అంతా కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.