బంగారు నగలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్​

by Sridhar Babu |
బంగారు నగలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్​
X

దిశ, భీంగల్ : బంగారు నగలు దొంగిలించిన కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సర్కిల్ కార్యాలయంలో ఎస్సై హరిబాబు తో కలిసి సీఐ ఎన్. శ్రీనివాస్​ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4 న సుదర్శన్ నగర్ తండా లో మధ్యాహ్నం బోదాసు ఎల్లవ్వ ఇంటికి బీరువా రిపేర్ చేయడానికి భీంగల్ బాపూజీ నగర్ కు చెందిన షేక్ హుస్సేన్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిని బీరువా రిపేర్ చేయమని చెప్పి ఇతర పనుల్లో నిమగ్నం అయింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన విషయం

కుటుంబ యజమాని ఎల్లవ్వ కొడుకు పోషన్న పోలీసులకు ఫిపిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి బాధితులు అందించిన సమాచారం మేరకు గాలించారు. బాధితులు తెలిపిన పోలికలతో ఉన్న వ్యక్తి భీంగల్ లో కనిపించాడు. పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీస్ రీతిలో విచారించగా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుని నుండి దొంగతనం చేసిన నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు పట్ట పగలు సమయంలో గ్రామాల్లోకి వచ్చి సంచరిస్తే వారి మాయమాటలు నమ్మవద్దని, వారిని ఇంట్లోకి రానివ్వొద్దని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed