డాటా ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించిన ...తహశీల్దార్ రమేష్

by Sumithra |
డాటా ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించిన ...తహశీల్దార్ రమేష్
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆన్ లైన్ నమోదు ప్రక్రియ కేంద్రాన్ని పరిశీలించారు తహశీల్దార్ రమేష్. ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా డాటా ఎంట్రీ చేపట్టాలని, వివరాలను ఆన్ లైన్ నమోదు ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఆన్ లైన్ చేసే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి డాటా ఎంట్రీని తొందరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దిశప్రతినిధితో మాట్లాడుతూ ఆలూరు మండల కేంద్రంలో 86 శాతం డాటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో డాటా ఎంట్రీ పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యదర్శులు రాజలింగం, నాజిర్, నవీన్, శ్రీనివాస్, సంతోష్ వివిధ గ్రామాల కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed