- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజన్నను దర్శించుకున్న నూతన ఎస్పీ అఖిల్ మహాజన్

X
దిశ, కోనరావుపేట : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని శుక్రవారం రాజన్న జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన్ దర్శించుకున్నారు. రాజన్న ఆలయానికి చేరుకున్న ఎస్పీకి ఆలయ పర్యవేక్షకులు పూల మాల వేసి ఆహ్వానించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కోడె కట్టేసి రాజన్నకు మొక్కు చెల్లించుకున్నారు.
స్వామి వారి కల్యాణ మండపంలో వేద మంత్రాలతో ఎస్పీని ఆశీర్వదించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర ఆలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, టీఎన్జీఓ రాష్ట కార్యవర్గ సభ్యుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, బన్సీలాల్ ఉన్నారు.
Also Read...
Next Story