పబ్లిక్ డొమెయిన్‌లో యాక్ట్ డ్రాఫ్ట్.. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం!

by Rajesh |
పబ్లిక్ డొమెయిన్‌లో యాక్ట్ డ్రాఫ్ట్.. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ సృష్టించిన విధ్వంసానికి లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆ ర్వోఆర్ యాక్ట్ 2020 అడ్డంకిగా మారింది. ఏ మార్పు తీసుకురావాలన్నా చట్ట సవరణ చేయాల్సి వస్తుంది. అందుకే సరికొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై రెండు గంటలు సమీక్షించారు. ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ కొత్త ఆర్వోఆర్ చట్టం డ్రాఫ్ట్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సవరణల కంటే కొత్త చట్టాన్ని తీసుకురావడమే మేల న్న అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.

ఆర్వోఆర్ చట్టాన్ని పబ్లి క్ డొమెయిన్‌లోనే పెట్టి సలహాలను స్వీకరించనున్నారు. త్వరలోనే డ్రాఫ్ట్ యాక్ట్‌ని ప్రజ ల్లోకి తీసుకురానున్నారు. ఎవరి నుంచి వి మర్శలకు తావు లేకుండా అన్ని వర్గాల నుం చి అభిప్రాయాలను సేకరించేందుకు వీలు కల్పించనున్నారు. ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదైనప్పటికీ పబ్లిక్ నుంచి తీవ్ర విమర్శలు రావడానికి కారణం అభిప్రాయ సేకరణ జరగకపోవడమే. కొత్త చట్టంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన ట్లు సమాచారం. కొత్తగా తాము తీసుకొచ్చే చట్టం రానున్న 20 ఏండ్ల వరకు ఉపయోగపడేలా, ఎలాంటి మార్పులు అవసరం లే కుండా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజల్లో చర్చ జరగాలి

కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వచ్చే ముందే ప్ర జల్లో విస్తృతంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తున్నది. దాని ద్వారా మంచి సలహాలు రావచ్చు. అంతకు మించి ప్రజలకు సంపూ ర్ణ అవగాహన కలగడం వల్ల రానున్న రోజు ల్లో అమలుకు ఇబ్బందులు తలెత్తవని ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఆర్వోఆర్ యా క్ట్ 2020ని ఇంట్లో కూర్చొని చేయడం ద్వా రానే ఇన్ని సమస్యలు తలెత్తాయన్న విమర్శ లు ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా అధికారాలను ఎవరికి, ఎందుకు, ఏ చట్టం ప్రకా రం కట్టబెట్టారో అంతుచిక్కని ప్రశ్నగా మిగి లింది. అందుకే కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, నిపుణు ల సలహాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. డ్రాఫ్ట్ ఆర్వోఆర్ యాక్ట్‌పై ఎలాం టి సూచనలు ఇచ్చినా స్వీకరించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాదాబైనామాలపైనా అరగంట చర్చ

నాలుగేండ్ల నుంచి పెండింగులో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో 30 నిమిషాల పాటు చర్చించారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై ధరణి కమిటీ సభ్యు డు రేమండ్ పీటర్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఏదో ఒక మార్గం చూపాల్సిందేనని సీఎంకు మిగతా సభ్యులు, అధికారులు కోరారు.

కొత్త చట్టం అవసరం ఎందుకు?

ఆర్వోఆర్ 2020 రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించింది. ఇందులో రికార్డుల సవరణకు అవకాశమే లేదు. గ్రీవెన్స్, అప్పీల్ మెకానిజం లేనే లేదు.

సామాన్యుడు ప్రతి చిన్న దానికి సివిల్ కోర్టుకే వెళ్లాలనడం సమంజసం కాదు.

ఆటోమెటిక్ మ్యుటేషన్ ప్రస్తుత రికార్డులతో సాధ్యం కాదు.

ధరణి పోర్టల్ ద్వారా అధికారాలను కట్టబెట్టడంలో చట్టబద్ధత లేదు.

భవిష్యత్తులో సర్వేకు వెళ్లి రికార్డులను సవరించే వెసులుబాటు లేదు.

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టంలో సెక్షన్లను తొలగించారు.

పెండింగ్ అప్లికేషన్లు, పార్ట్ బి సమస్యలకు పరిష్కారం చూపడం లేదు.

35 మాడ్యూళ్లతో గందరగోళం నెలకొన్నది. సామాన్య రైతుకు అర్థం కాదు. ఏ మాడ్యూల్‌లో అప్లై చేయాలన్నది రైతుకు ఎలా తెలుస్తుంది?

ఇలాంటి ఎనిమిది పాయింట్లతో కొత్త ఆర్వోఆర్ చట్టం అవసరంపై ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ సమీక్షలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.



Next Story