New Parliament Building Inauguration : పాత పార్లమెంట్ భవనం ఏం చేయనున్నారంటే?

by Sathputhe Rajesh |
New Parliament Building Inauguration : పాత పార్లమెంట్ భవనం ఏం చేయనున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా మోడీ అభివర్ణించారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని 150 ఏళ్లు నిలిచేలా ధృడంగా నిర్మించారు. త్రికోణాకారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్ల కాగా వీఐపీలు, ఎంపీలు సందర్శకులకు వేర్వేరు ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు.

పాత భవనాన్ని ఏం చేయనున్నారంటే?

పాత భవనం వినియోగం గురించి 2021 మార్చిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమయ్యాక, పాత పార్లమెంట్ భవనానికి మరమత్తులు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ వినియోగానికి ఈ బిల్డింగ్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంలో సమగ్ర ఆలోచన చేయలేదన్నారు. పాత పార్లమెంట్ భవనం దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామన్నారు. పార్లమెంట్ లో జరిగే కొన్ని కార్యక్రమాలకు దీన్ని వినియోగించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed