- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC లీకేజీ కేసులో తెరపైకి కొత్త పేర్లు.. పేపర్ వాళ్లకు కూడా చేరిందా..?
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిట్ దర్యాప్తులో తాజాగా తెరపైకి మరికొందరి పేర్లు రావడం సంచలనంగా మారుతోంది. ప్రశ్నపత్రాలు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక ఆమె భర్త డాక్యనాయక్‌తో పాటు ఇంకెవరెవరి చేతికి చేరాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. తాజాగా రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్‌లకు సన్నిహితంగా ఉన్నవారిపై ఫోకస్ పెట్టింది. ఈ కేసులో నిందితుల పెన్ డ్రైవ్, వాట్సాప్ చాటింగ్‌లను రీట్రీట్ చేసి ఇందులో లభించిన ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును ముందుకు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో రేణుక కోచింగ్ సెంటర్ నిర్వహకులతో సైతం టచ్‌లో ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. రాజశేఖర్ స్నేహితుడు రమేష్ పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. అలాగే కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు గ్రూప్1 ప్రిలిమ్స్ క్వాలిపై అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో టీఎస్ పీఎస్సీలో పని చేస్తున్న మరో 42 మందికి బుధవారం దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు.
అలాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరిండెంట్ శంకర లక్ష్మి స్టేట్ మెంట్‌ను ఇవాళ నమోదు చేసిన అధికారులు ఆమె పాత్రపై మరింత దర్యాప్తు చేయడంపై ఫోకస్ పెట్టింది. రేపు మరోసారి ఆమె వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఇవాళ మొత్తం తొమ్మిది మంది నిందితులను విచారించిన అధికారులు.. ఇటీవల వారు నిర్వహించిన లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుండటంతో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది.