Delhi Liquor Case :దోచుకుంది నువ్వైతే తెలంగాణకు ఏం సంబంధం.. కవితపై నెటిజన్లు ఫైర్

by GSrikanth |   ( Updated:2023-03-08 10:31:11.0  )
Delhi Liquor Case :దోచుకుంది నువ్వైతే తెలంగాణకు ఏం సంబంధం.. కవితపై నెటిజన్లు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘తెలంగాణ తలవంచదు’ అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మాటి మాటికి తెలంగాణ పేరును తీసి ఎందుకు సెంటిమెంట్లను రాజేయలని చూస్తరు? అని కవితను పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. మీరు చేసే తప్పుడు పనులకు తెలంగాణ సమాజానికి అసలేంటి సంబంధం?. మీరు ముమ్మాటికీ తప్పు చేశారు దానికి తగ్గ శిక్ష తప్పకుండా అనబవించాల్సిందే’ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

‘తెలంగాణ మీ ఒకరిదే కాదు..మీకు నోటీసులిస్తే తెలంగాణకి ఇచ్చినట్టా? మరి ఎందుకు మీ ఇంటికి వెళ్లే దారులు మూసేశారు? అని మరొక నెటిజన్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘నీ లిక్కర్ దందా వళ్లా తెలంగాణ ఆడబిడ్డలు అంతా తల వంచుకునే పరిస్థితి వచ్చిందంటూ వేల మంది నెటిజన్లు స్పందిస్తూ కవిత ట్వీట్‌కి కామెంట్స్ రూపంలో చురకలంటిస్తున్నారు.

Advertisement

Next Story