PRC పెంపుపై చర్చలు విఫలం.. విద్యుత్ సరఫరాపై ఎఫెక్ట్

by GSrikanth |
PRC పెంపుపై చర్చలు విఫలం.. విద్యుత్ సరఫరాపై ఎఫెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ పెంపుపై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు జగదీశ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని మంత్రి స్పష్టంచేశారు. కాగా మంత్రి చేసిన ప్రతిపాదనలను జేఏసీ తిరస్కరించింది. 25 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ చర్చలు విఫలం కావడంతో సోమవారం నుంచి చేపట్టాల్సిన సన్నాహక సమావేశాలు యథావిధిగా కొనసాగుతాయని జేఏసీ నేతలు వెల్లడించారు. సోమవారం నుంచి ట్రాన్స్ కో, జెన్ కో లో ప్రతిరోజు జరిగే సమీక్ష సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

17వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రితో నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, ట్రాన్స్ కో జేఎండి శ్రీనివాసరావు, జేఏసీ నాయకులు సాయిబాబు, రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి, అనిల్ కుమార్, వజీర్ గోవర్దన్, వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed