NPRD: దివ్యాంగులకు బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం.. బడ్జెట్ పత్రాల దగ్ధం

by Ramesh N |   ( Updated:2025-02-01 12:25:57.0  )
NPRD: దివ్యాంగులకు బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం.. బడ్జెట్ పత్రాల దగ్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ ప్రభుత్వం దివ్యాంగులకు (Union Budget 2025) బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం వహించిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఫైర్ అయింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు కేంద్ర బడ్జెట్ పత్రాల దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ.. నోడల్ డిపార్ట్‌మెంట్, వికలాంగుల సాధికారత శాఖకు చేసిన మొత్తం కేటాయింపులో 4 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, దివ్యాంగుల జనాభాకు అనుగుణంగా కేటాయించలేదని తెలిపారు. మొత్తం బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమనికి కేటాయించిన మొత్తం కేవలం 0.025 శాతం మాత్రమేనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరణ చేసి వికలాంగులకు 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ హక్కు చట్టాన్ని అమలు చేయాలని, పెన్షన్‌ను రూ. 300 నుంచి రూ. 5000/-కి పెంచాలని, RPD చట్టం ద్వారా గుర్తించబడిన 21 రకాల వికలాంగులను చేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు, ఇతర డిమాండ్స్ సాధన కోసం ఫిబ్రవరి 10న ఢిల్లీలో వికలాంగుల మహాధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 2 న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యానికి నిరసనగా జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed