- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమాలకు SRSP డీఈ వత్తాసు.. కథనం రాసిన రిపోర్టర్‌పై చిందులు (ఆడియో)
దిశ, నెక్కొండ: అక్రమాలకు కొమ్ముకాయడం అంటే ఇదేనేమో. శాఖ ఆస్తులను రక్షించాల్సిన అధికారి తన నిర్లక్ష్యంతో రియల్టర్లకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. కాల్వ కబ్జా చేస్తున్నారు చర్యలు తీసుకోండి మహప్రభో అంటూ నెక్కొండ రైతులు చెబుతున్నా.. ఆయన పెడచెవిన పెడుతున్నారు ఎస్సారెస్పీ డీఈ యాదగిరి. ఆయన పనితీరు అంత నిర్లక్ష్యంగా మారడానికి, కబ్జా కూడా తప్పుగా కనిపించకపోవడానికి రియల్టర్లకు, ఉన్నతాధికారులకే తెలియాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథనం రాశాం. దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా..? అంటూ వివరణకు ఫోన్ చేసిన రిపోర్టర్ పైనా చిరుబురులాడారు.
అసలేం జరిగిందంటే..?
నెక్కొండ మండల శివారు వరంగల్ రోడ్డులో శివాని రియల్ వెంచర్ నిర్వాహకులు ఎస్సారెస్పీ కాల్వను కబ్జా చేస్తూ దానిపై నుంచి రహదారి నిర్మించారు. ఎస్సారెస్పీ కాల్వను వెంచర్‌కు దారిగా చూపారు. వెంచర్‌కు నిర్మించిన దారి దగ్గర కింద నుంచి పైపులు వేసి నీటిని కింద నుంచి వెళ్లేలా చేశారు. వాస్తవానికి కాల్వ పూడ్చివేస్తూ నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా చేయడమే కాకుండా కాల్వను దాదాపుగా పూడ్చివేశారు. దీంతో కింది ఆయకట్టు రైతుల భూములకు నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. ఇదే విషయంపై పంట కాల్వ ‘కబ్జా’ శీర్షికన శుక్రవారం ‘దిశ’ దినపత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనానికి సదరు డీఈ వివరణను కూడా తీసుకుని ప్రచురించడం జరిగింది. అయితే కథనం ప్రచురించిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటూ డీఈకి ‘దిశ’ రిపోర్టర్ వివరణ కోసం ఫోన్ చేశారు.
ఈ పరిణామం డీఈకి నచ్చకపోవడంతో ‘‘కాల్వకు ఏం డ్యామేజ్ అయ్యిందని వార్త రాశావు. నువ్వు ఇంజినీరువా..? రిపోర్టరా..? వెడల్పు ఎంత..? వెడల్పు పర్ఫెక్ట్. వెంచర్ నిర్వాహకులు తాత్కాలికంగా రోడ్డు వేసారు. మనకు అవసరం ఉన్నప్పుడు, నీళ్లు పెంచుకున్నప్పుడు నోటీసులు లేకుండా తీసేస్తాం. వేరేచోట కాల్వ పూడ్చితే సగం తీసాము. రెండు మూడు రోజుల్లో మిగతా సగం తీస్తాం. కాల్వకు ఇబ్బంది ఐతే ఎవరిని సహించం. కెనాల్ భూముల్లో అక్రమంగా భూముల్లో సెంట్ ఏమైనా జరిగినా యాక్షన్ తీసుకుంటా.. రెక్టీఫైడ్డ్’’ అని సమాధానం ఇచ్చారు. కళ్లముందే కాల్వ భూమిని పూడ్చేసి కబ్జా చేస్తున్నా, సార్‌కు తప్పుగా కనిపించకపోవడం విశేషం. అక్రమాలపై చర్యలు తీసుకుంటామంటూనే దాటవేస్తూ.. తన పనితీరును సమర్ధించుకోవడం గమనార్హం. డీఈ వ్యవహార శైలి రియల్టర్లతో డీఈ కుమ్మక్కయ్యారా అన్న ఆరోపణలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమకు నష్టం కలిగిస్తున్నారని చెబుతున్నా కాల్వపై నిర్మించిన దారిని తొలగించేందుకు చర్యలు చేపట్టడం లేదని మండిపడుతున్నారు. మరి ఉన్నతాధికారులైనా ఈ విషయంపైనా స్పందిస్తారో..? లేదంటే డీఈ యాదగిరి ఇష్టారాజ్యానికి వదిలేస్తారో వేచి చూడాలి.
ప్లాట్లు కొన్న ప్రజల పరిస్థితి ఏంటి..?
వెంచర్లో ఎన్నో ఆశలు పెట్టుకొని ప్లాట్లుకొన్న పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి..? భవిష్యత్తులో వెంచర్లో ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఐరన్, సిమెంట్ తదితర సామాగ్రి తరలించాలంటే భారీ వాహనాల్లో తీసుకెళ్లాలి. కెనాల్ కాలువపై వెంచర్ నిర్వాహకులు తాత్కాలికంగా వేసిన రోడ్డు ఇప్పటికే కుంగిపోయింది. రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు చెబుతున్నట్లు కాలువతీస్తే, వెంచర్లోకి దారేది..? ఎన్నో ఆశలతో లక్షలుపోసి ప్లాట్లు కొన్న ప్రజలకు ఇబ్బందులు తప్పవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మరి తప్పెవరిది..? తాత్కాలికంగా ఎస్ఆర్ఎస్పీ కాలువపై నుంచి రోడ్డు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఇరిగేషన్ అధికారులదా..? వెంచర్ నిర్వాహకులదో డీఈకే తెలియాలి. వెంచర్ సమీపంలో మాత్రం నీటి ప్రవాహం తగ్గి సమీపంలో ఉన్న ప్లాట్లు,పంటపొలాలు నీటమునుగుతున్నాయి. ప్రహహం ఎక్కువై నీరు అడ్డదిడ్డంగా వెళ్లడంతో కొందరు రైతులు తమ పంటపొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను ఇకనైనా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.