NEET UG 2024: బ్రేకింగ్ న్యూస్.. నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల

by Mahesh |   ( Updated:2024-07-25 13:44:51.0  )
NEET UG 2024: బ్రేకింగ్ న్యూస్.. నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. పేపన్ లీక్ అయిందని పలువురు అభ్యర్థులు వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లు వేయగా అన్నింటిని కలిపి విచారించిన సుప్రీంకోర్టు.. నీట్ 2024 యూజీ పరిక్షలను రద్దు చేయాలని వేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే నీట్ పరీక్షలను రద్దు చేయడం సరికాదని.. వ్యాఖ్యానించిన కోర్టు రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని ఎన్డీఏకు ఆదేశించింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఎన్టీయే నీట్ 2024 యూజీ పరీక్షలకు సంబంధించిన సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు 5 మార్కులు కోల్పోయారు. కాగా NEET UG 2024 సవరించిన ఫలితాలు https://neet.ntaonline.in/frontend/web/revised-scorecard/indexలో అందుబాటులో ఉన్నాయి. జనరల్, జనరల్-పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఈ ఏడాది కటాఫ్ గత ఏడాది 720-137 ఉండగా 720-164 కి పెరిగింది. NTA NEET UG 2024లో ఆల్-ఇండియా కామన్ మెరిట్ లిస్ట్‌లో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగా NEET UG శాతాన్ని నిర్ణయిస్తుంది. పర్సంటైల్ కూడా మార్చబడుతుంది. ఈ ఏడాది మెడికల్ ప్రవేశ పరీక్షకు 24,06,079 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 23,33,297 మంది హాజరయ్యారు.

Advertisement

Next Story