ఆరోగ్య శ్రీలో చేర్చిన వ్యాధులపై పబ్లిసిటీ అవసరం: ఎమ్మెల్సీ

by Gantepaka Srikanth |
ఆరోగ్య శ్రీలో చేర్చిన వ్యాధులపై పబ్లిసిటీ అవసరం: ఎమ్మెల్సీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీపై ఫుల్ పబ్లిసిటీ అవసరం అన్నారు. ఈ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ తరహాలో ఓ విధానాన్ని అమలు చేస్తూ ట్రాన్స్ ప్లాంటేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులపై స్పాట్ అడ్మిషన్లు ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రైవేట్, నెట్ వర్క్, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అంటే సతాయిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఆయా ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించడమే కాకుండా, అన్ని ఆసుపత్రులకు ప్రత్యేక ఆదేశాలివ్వాలన్నారు. కార్డు ఉంటే అన్ని ఉచితంగా నిర్వహించేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక ప్రాథమిక స్థాయిలో డయాలసిస్ సెంటర్లు అవసరం అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు ప్రతీ నెల జీతాలు ఇవ్వాలన్నారు. రెండు మూడు నెలలకోసారి ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

Advertisement

Next Story