- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవీన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక, అతని స్నేహితుడు హాసన్‌ను సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి కోసమే నవీన్‌ను హత్య చేసినట్లు హరిహరకృష్ణ కస్టడీలో చెప్పడంతో నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా హరిహరకృష్ణ, ఏ2 గా హాసన్, ఏ3 గా నిహారిక పేర్లను చేర్చారు.
కాగా, రెండ్రోజుల క్రితమే నవీన్ హత్య కేసులో యువతికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో ఆమె ఇన్వాల్వ్ అయినట్లు ఆధారాలు ఏం లభించలేదు అని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ వెల్లడించారు. హరిహరకృష్ణకు సహకరించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. స్నేహితుడ్ని పాశవికంగా హత్య చేసిన తీరుపై హరిహరకృష్ణ వద్ద వివరాలు రాబడుతున్నట్లు తెలిపారు. ఈనెల 9 వరకు నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అనూహ్యంగా అమ్మాయిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.