- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్చుతూ ఉత్తర్వులు

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Project) పేరు మార్చాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(Sudini Jaipal Reddy) పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ(Telangana Cabinet) నిర్ణయానికి అనుగుణంగా గురువారం నీటిపారుదల శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్‌ఐ పథకంగా నామకరణం చేశారు. అంతేకాదు.. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహా తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనర్సింహ పేరు పెట్టాలని కేబినెట్‌లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు రెండో ప్యాకేజీ రివైజ్డ్ ఎస్టిమేట్ రూ.1,784 కోట్లకు ఆమోదం తెలిపారు. ఏదల రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్ట్ స్కీంకు లింక్ చేసే పనులకు రూ.1,800 కోట్లతో ఆమోదముద్ర వేశారు.