- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
దిశ, హుజూర్ నగర్: యువత సమాజంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో గంజాయి సేవిస్తున్న వ్యక్తులకు బుధవారం హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి సేవిస్తే జరిగే అనర్ధాలను వివరించారు. ఎవరైనా గంజాయి సేవించిన రవాణా చేసిన వారిపై చట్టమైన కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారు హెచ్చరిస్తూ ఉన్నత విషయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. మహిళల పట్ల సోదరి భావంతో మెలగాలని సూచించారు. అలాగే ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసిన, పీడీఎస్ బియ్యం రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మఠంపల్లి పాలకవీడు ఎస్సైలు రవీందర్ రామాంజనేయులు లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.