మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలి

by Naresh |
మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలి
X

దిశ, నకిరేకల్ టౌన్: మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ రోజురోజుకు విపరీతంగా వ్యాపిస్తుందని ఈ వ్యాధికి సంబంధించి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరు వేయించుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు వైద్యుల సూచనలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపోలు రఘునందన్, రాపోలు మంజుల, పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, యాసారపు వెంకన్న, గడ్డం స్వామి, ఏసు పాదం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story