ఆ పని చేసిన కొడుకులు.. పోలీస్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం

by samatah |   ( Updated:2022-03-09 09:46:50.0  )
ఆ పని చేసిన కొడుకులు.. పోలీస్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ,చౌటుప్పల్: తరచూ తన కొడుకులు గొడవ పడుతున్నారంటూ ఓ తల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె ఇరువురు కొడుకులను పిలిపించి మందలించారు. తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కొడుకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన తల్లి పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జైకేసారం గ్రామానికి చెందిన బోదాసు ఆండాలు (55) తన కొడుకు గొడవ పడుతున్నారంటూచౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి బుధవారం వచ్చింది. దీంతో కొడుకు తల్లి పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో నే ఆండాలు ఆత్మహత్యాయత్నం చేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.50% గాయాలతో కాలిన అండాలు ను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భువనగిరి డీసీపీ కే.నారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story