- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూనివర్సిటీల ఉపకులపతుల పదవులు ఉంటాయా.. ఊడిపోతాయా..?
దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాలో ఒక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం తప్ప మిగిలిన పది యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ల పదవి ఉంటుందా ఊడుతుందా తెలియని అగమ్య గోచరంలో ఉన్నాయి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి వివరాల్లోకి లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ జరిగింది. ఐతే ఇట్టి వైస్ ఛాన్సలర్ల నియామకంలో ముగ్గురు సభ్యులతో కూడుకున్న త్రిసభ్య కమిటీ వైస్ ఛాన్సలర్ల పదవికి అప్లికేషన్ పెట్టుకున్న వారి నుంచి ఆ విశ్వవిద్యాలయంకి ముగ్గురి పేర్లను వారి అర్హతలను బట్టి క్రమ పద్ధతిలో ముగ్గురి పేర్లు గవర్నర్‌కు సిఫారసు చేస్తారు. ఇది అంతా కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల ద్వారా ప్రభుత్వం నియమించిన వ్యక్తుల ద్వారా పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ.
కానీ ఈ త్రిసభ్య కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శియే సభ్యుడు కావడం చట్ట విరుద్ధం అని, ప్రభుత్వం తనకు ఇష్టం అయిన వారిని వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులను నియమించుకునే వీలు ఉంటుందని, పారదర్శకత లోపిస్తుంద,ని ఇది యూజీసీ నియమ నిబంధనలకు విరుద్ధం అని కొందరు రిటైర్డ్ ప్రొఫెసర్లు, కొన్ని జాతీయ స్థాయి విద్యార్థి సంఘాలు హై కోర్ట్ లో కేసు వేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధంగానే వేరే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్రిసభ్య కమిటీలో సభ్యులు ఉండటం చేత అట్టి నియామకాలు చెల్లవు అని దేశ అత్యున్నత న్యాయస్థామైన సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఇతర రాష్ట్రాల కోర్టులు కూడా ఈ విధంగా జరిగిన వైస్ ఛాన్సలర్‌ల నియామకం చెల్లవు అని కోర్ట్ తీర్పు ఇచ్చాయి.
ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ విధమైన కోర్టు కేసు ఏప్రిల్ మాసం 6 వ తేదీ నాడు జస్టిస్ విజయ సేన్ రెడ్డి గారి కోర్ట్‌లో విచారణ జరగబోతున్నది. ఇలా ఉంటే పది సంవత్సరాల ప్రొఫెసర్ అనుభవం లేని వారు, 70 సంవత్సరాలు నిండిన వారు వైస్ ఛాన్సలర్లుగా చట్ట విరుద్ధంగా నియమించబడ్డారని వివిధ కేసులు, అదే రోజు విచారణకు రానున్నాయి. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా వస్తుందని, తెలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే అడ్వకేట్ జనరల్‌ను, అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను కోర్టులో హాజరు కాకుండా చూస్తున్నారని అనుకుంటున్నారు. ఇంకా కొందరు వైస్ ఛాన్సలర్ల కొన్ని కోట్ల రూపాయల వరకు లంచం ఇవ్వడానికి సిద్దం అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కోర్టు తీర్పు ఉపకులపతిల నియామకం తెలంగాణ ప్రభుత్వం నికి వ్యతిరేకంగా వస్తుందో లేక అనుకూలంగా వస్తుందో వేచి చూడాల్సిందే.