- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన గ్రామ పారిశుధ్యం
దిశ,నాగారం: మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారి తాహశీల్దార్ వి.బ్రహ్మయ్య పాలనలో పారిశుద్ధ్య పనులు పడకేసిందని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ,ఎస్టీ కాలనీలలో చెత్త చెదారం నిండిపోయిందని వాపోతున్నారు. దుర్గంధం వెదజల్లే చెత్తతో కాలనీవాసులు ఆనారోగ్యం పాలవుతున్నారన్నారు. వ్యర్థాలు నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు వెలసి అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. గ్రామంలోని డ్రైనేజీలు నిండి చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. ఎన్నోసార్లు స్పెషల్ ఆఫీసర్ కి ,గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా..ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దోమల బెడద నివారణకు ఫాగింగ్ చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా..దోమల నివారణకు నేటికి కూడా ఫాగింగ్ చేయని దుస్థితి ఏర్పడటంతో దోమల బెడద ఎక్కువ అవుతుందని తెలిపారు. మురుగు కాలువల్లో దుర్గంధం వాసన వస్తుందని, ప్రజలు ఇంటిముందు ఉండాలంటే ముక్కు మూసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సర్పంచులు లేకపోవడంతో స్పెషల్ అధికారి పాలన నియమించామన్నారు. దీంతో స్పెషల్ ఆఫీసర్ ఏనాడు కూడా గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించి..ప్రజలను రోగాల భారీ నుంచి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.