Gas Accident : గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు..

by Sumithra |
Gas Accident : గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు..
X

దిశ, చిలుకూరు : వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న దుర్ఘటనలో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండాపురానికి చెందిన మేరిగ శిరీష బుధవారం వంట చేసేందుకు గ్యాస్ స్టౌ ఆన్ చేసింది. అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.

శిరీషకు తీవ్రగాయాలు కాగా ఇంట్లోనే ఉన్న ఆమె భర్త అమర్ గోపాల్, మామ గురవయ్య కూడా మంటల్లో చిక్కుకుని గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. సూర్యాపేటలో బాధితులను పరిశీలించిన వైద్యులు ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Next Story

Most Viewed