రియల్టర్లు సంబురాలు.. రైతులు లబోదిబో

by srinivas |
రియల్టర్లు సంబురాలు.. రైతులు లబోదిబో
X

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్లు (ట్రిపుల్ ఆర్) నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర తెలంగాణలో భూసేకరణ జరుగగా దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లింకు రోడ్డు నిర్మాణం నమూనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మర్రిగూడ మండలం మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, చింతపల్లి మండలంలోని కురుమేడుకు వెళ్తుందనే మ్యాపులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెగ సంబుర పడుతున్నారు.

కాగా, గుర్తులు వేసిన భూముల రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గతంలో మార్కు వేసినప్పుడు మర్రిగూడ మీదుగా వెళుతుండగా ప్రస్తుతం వేసిన గుర్తులు మర్రిగూడ గ్రామం దిగువ భాగం నాంపల్లికి వెళ్లే డబుల్ రోడ్డు పైన ప్రత్యక్షమయ్యాయి. దీంతో సమీప ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రోడ్లపై గుర్తులు వేయడంతో రోడ్డు పరిధిలో భూములు కోల్పోయే రైతన్నలు శోకసంద్రంలో మునిగారు.

- దిశ, మర్రిగూడ

దిశ, మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్లు (ట్రిపుల్ ఆర్) నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర తెలంగాణలో భూసేకరణ జరుగగా దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లింకు రోడ్డు నిర్మాణం నమూనాలు చక్కర్లు కొట్టడంతో మర్రిగూడ మండలం మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, చింతపల్లి మండలంలోని కురుమేడుకు వెళ్తుందనే మ్యాపులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెగ సంబుర పడుతుండగా గుర్తులు వేసిన భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మార్కు వేసినప్పుడు మర్రిగూడ మీదుగా వెళుతుండగా ప్రస్తుతం వేసిన గుర్తులు మర్రిగూడ గ్రామం దిగువ భాగం నాంపల్లికి వెళ్లే డబుల్ రోడ్డు పైన గుర్తులు ప్రత్యక్షమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రోడ్లపై గుర్తులు వేయడంతో రోడ్డు పరిధిలో భూములు కోల్పోయే రైతన్నలు శోకసంద్రంలో మునిగారు. ఆలు లేదు-సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా రోడ్లపై వేసిన మార్కులతో ప్రభుత్వం తమ భూములకు తక్కువ నష్టపరిహారం అందిస్తుందని తమ కుటుంబాలు రోడ్డుపై పడుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రోడ్లపైన రెండు గుర్తులు వేయడంతో ప్రజల్లో ఆసక్తిక చర్చ జరుగుతోంది.

ఆ రెండు గుర్తులపైనే ప్రజల్లో చర్చ

ఇటీవల మర్రిగూడ దిగువ భాగాన నాంపల్లికి వెళ్లే డబుల్ రహదారి పైన రెండు మార్కులు వేశారు. ఒకటి టీ2-820 కాగా మరొకటి ఎస్106 గుర్తులు వేశారు. ఒక గుర్తు రైల్వే లైను ఏర్పాటు అవుతుందని, మరొక గుర్తు రీజనల్ రింగ్ రోడ్డుగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ గుర్తులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వ లేదని, ఉన్నత స్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుండడం, రోడ్లపై గుర్తులు దర్శనమివ్వడం ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

200 అడుగుల వెడల్పుతో రోడ్లు...

రేడియల్ రోడ్డు 200 అడుగుల వెడల్పు వరకు ఉంటాయి. ప్రధానంగా రేడియల్ రోడ్డు 100 అడుగులు కాగా భవిష్యత్తు అవసరాల కోసం రెండు వైపులా 50అడుగుల చొప్పున 100 అడుగులు తీసుకుంటారు. దీంతో రేడియల్ రోడ్డు 200అడుగుల వెడల్పు ఉంటుంది.

పుంజుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం...

రీజనల్ రింగ్ రోడ్డుల గుర్తులు రోడ్లపై దర్శనం ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. గతవారం రోజుల నుంచి మండల వ్యాప్తంగా గుర్తులు ఉన్న సమీప గ్రామాల్లో పెద్దపెద్ద కార్లు దర్శనమిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు నైరాశంలో ఉండగా సమీప గ్రామాల భూముల రైతులు, సమీప గ్రామాల రైతుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎకరం భూమి రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల పైచిలుకే పలుకుతోంది. పెద్ద పెద్ద కార్లు గ్రామాల్లో తిరుగుతుండడంతో రైతులు వ్యవసాయ భూముల ధరలను భారీగా పెంచేశారు.

రాత్రిపూట డ్రోన్ల కలకలం...

ఇటీవల రోడ్లపై గుర్తులు ప్రత్యక్షమైన నాటి నుంచే గ్రామాల్లో రాత్రిపూట డ్రోన్ల సంచారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గుర్తుల వెంట ఉన్నా భూములను గుర్తించి కొనుగోలు చేయడానికి రాత్రిపూట డ్రోన్ల సంచారం జరుగుతుందని ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనా రోడ్లపై గుర్తులు ప్రత్యక్షమవడం, ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డుపై సమీక్షలు చేయడంపై మండలం మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే మార్గం వస్తుందని ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వం గెజిటివ్ విడుదల చేస్తే కాని ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed