కూలీ కోసం వచ్చి శవమైన విజయ్.. మరణించి పది రోజులయినా..

by Disha News Desk |
కూలీ కోసం వచ్చి శవమైన విజయ్.. మరణించి పది రోజులయినా..
X

దిశ, మర్రిగూడ: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జై హారం గ్రామానికి చెందిన పెద్ద కత్తుల విజయ్(20) రంగారెడ్డి, నల్గొండ జిల్లా సరిహద్దులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు ప్రకారం.. సురేష్ అనే మేస్త్రి వద్ద పెద్ద కత్తుల విజయ్, వెంకటయ్యలు మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో కూలీ పనిచేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటయ్యను మాల్‌లో దింపి రావడానికి విజయ్ బండిపై బయలు దేరాడు. అతడిని దింపి తిరిగి వస్తుండగా తిరుగండ్లపల్లి మూలమలుపు వద్ద బైకు అదుపు తప్పి పొదల్లో పడి మరణించాడు. ఆ రోజు నుండి నేటి వరకు కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో విజయ్ తల్లిదండ్రులు మేస్త్రి సురేష్ పై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బైక్ కింద పడిన ప్రాంతానికి చెందిన రైతు లక్ష్మణ్ నాయక్‌కు పొదల్లో కుళ్లిన శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహం విజయ్‌‌గా తల్లిదండ్రులకు సమాచారం అందించారు.



Advertisement

Next Story

Most Viewed