- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 ఎకరాల్లో మినీ స్టేడియం ఏర్పాటు
దిశ, నర్సాపూర్: నర్సాపూర్ పట్టణ పరిధిలోని డంపు యార్డు సమీపంలో ఏడెకరాల్లో మినీ స్టేడియం నిర్మిస్తున్నట్లు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి నాగరాజు, తహసీల్దార్ కమలాద్రి, మున్సిపల్ కార్యాలయం మేనేజర్ మధుసూదన్‌తో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన భూమికి సంబంధించిన పత్రాలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి నాగరాజుకు అప్పగించారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ… నర్సాపూర్ ప్రాంతంలో సరైన స్టేడియం లేక ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు కనుమరుగైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ స్టేడియం కోసం ఇప్పటికే రూ. 12 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అధునాతన అంగులతో నూతన సాంకేతిక విధానంతో మినీ స్టేడియాన్ని నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణయ్య, సర్వేయర్ మొగులయ్య, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కుమ్మరి నగేష్, తంగేడిపల్లి ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.