ఏడాదికి నాలుగు సార్లు ఓటర్ల నమోదు : ఆర్డీవో రాజేంద్ర కుమార్

by Sumithra |
ఏడాదికి నాలుగు సార్లు ఓటర్ల నమోదు : ఆర్డీవో రాజేంద్ర కుమార్
X

దిశ, తుంగతుర్తి : ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి ఏటా నాలుగు సార్లు జరుగుతుందని సూర్యాపేట ఆర్డిఓ రాజేంద్రకుమార్ వెల్లడించారు. ప్రతి మూడు మాసాలకు ఒక సారి నిర్వహించే ఈ కార్యక్రమంలో 17 ఏండ్ల వయసు నిండినవారు కూడా ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. అయితే 18 ఏండ్లు పూర్తయిన పిదపనే ఓటరుగా గుర్తిస్తామని తెలిపారు. శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 18 ఏండ్ల వయసు నిండిన పిదపనే సదరు వ్యక్తి ఓటు నమోదుకు అర్హత సాధించేవారున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియలో పలుమార్పులు జరిగినట్లు తెలిపారు. కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమంలో అన్ని రాజకీయపక్షాలు భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో స్థానిక తహసిల్దార్ రాంప్రసాద్, డీటీ శ్రీకాంత్, ఆర్ఐ రవీందర్ రెడ్డితో పాటు నూతనకల్, మద్దిరాల, నాగారం, తిరుమలగిరి, శాలిగౌరారం, అర్వపల్లి, అడ్డగూడూరు, మోత్కూర్ మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే మండలంలోని వెలుగుపల్లి, తుంగతుర్తి, అన్నారం గ్రామాలలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీవో రాజేంద్ర కుమార్ పరిశీలించారు. వాతావరణం పరిస్థితులు మారుతున్న దృష్ట్యా కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. లారీల కొరత ఉన్న విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న ఆయన ప్రతి కేంద్రానికి రెండు లారీలు కేటాయిస్తామని తెలిపారు. అంతేకాకుండా ధాన్యం దిగుమతులను కూడా వెంట వెంటనే జరపాలని ఫోన్ ద్వారా మిల్లర్లను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed