గ్యాస్, కూరగాయలు ప్రదర్శిస్తూ ప్రజాసంఘాల నిరసన

by Sumithra |
గ్యాస్, కూరగాయలు ప్రదర్శిస్తూ ప్రజాసంఘాల నిరసన
X

దిశ, మిర్యాలగూడ : పెరిగిన గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ సీపీఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడ సుందరయ్య చౌరస్తా వద్ద వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి స్థానిక మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్, కూరగాయలు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రైతుల వద్ద తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేస్తున్న దళారీలు అడ్డగోలు ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దళారులను కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, జగదీశ్ చంద్ర, రవినాయక్, మల్లు గౌతమ్ రెడ్డి, వరలక్ష్మి, అంజద్, గోవర్ధన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed