- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు ) : స్థానిక సంస్థల పంచాయతీకి ఎన్నికలకు కార్యకర్తలు అంతా సిద్ధం కావాలని వారి రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో అలింగాపురం గ్రామంలో 30 కోట్లతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి ఫిబ్రవరి నెలలో జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని, రైతు భరోసా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు.
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ హుజూర్ నగర్ ,నియోజకవర్గం అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని అన్నారు. హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఏడుసార్లు నుంచి ఒకే ప్రాంతం నుంచి గెలిపించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య,డిఇ రమేష్, మాజీ ఎంపీపీ గోపాల్, మోతిలాల్ నాయక్, సుబ్బారావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.