- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనగిరి పట్టణంలో వినూత్న ఘటన.. వార్డును అభివృద్ధి చేయమని ప్లెక్సీ ఏర్పాటు..
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పట్టణంలోని తమ వార్డు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉందని, అయినా కూడా అభివృద్ధికి నోచుకోవటం లేదని భువనగిరి పట్టణంలోని 8వ వార్డు రాంనగర్ కు చెందిన ప్రజలు భువనగిరి పట్టణంలో ప్లెక్సీను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ప్రధాన రోడ్డు పక్కన ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
కాలనీలో ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని, బయట ఉన్న (బొల్లెపల్లి) మురుగును శుభ్రం చేస్తారని హామీ ఇచ్చిన నాయకులు ఎందుకు చేయడం లేదని, పన్నుల కడుతున్న కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓటు వేసినందుకు మేము సిగ్గుపడాలా ? మరి పనులు చేయనందుకు మీరా ? అని ఫ్లెక్సీల ద్వారా రాంనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.