- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలేశ్వరం కొండకు భక్తుల తాకిడి
దిశ, నాగార్జునసాగర్: ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీ జలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు… నిశ్శబ్ద ప్రకృతిలో నాగార్జునసాగర్‌లో పర్యాటక శాఖ ప్రత్యేక లాంచీలు ప్రయాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం, చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, పక్షుల కిలకిలరావాలు, నిశ్శబ్ద ప్రకృతిలో ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఎత్తైన పచ్చని కొండలన్నీ, నీలి జలాల్లో తన అందాన్ని చూసుకునే నీలాకాశాన్ని, ఆ పచ్చని కొండల్ని తెల్లని మేఘాలని ప్రతిబింబిస్తూ నిశ్చలంగా కదులుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చు. మధ్యలో చుట్టూ దట్టమైన వనం.. కనువిందు చేసే పచ్చదనం, చూడముచ్చటైన జలపాతం.. ప్రకృతి అందాల నడుమ నల్లమల అటవీ ప్రాంతంలో శివయ్య దర్శనం భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరిం చుకుని నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు పర్యాటక శాఖ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక లాంచీలు శివుడు కొలువైన ద్వీపం ఏలేశ్వరం కొండకు లాంచీలు నడిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగార్జునసాగర్ పరిధిలో కృష్ణానదీ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం గట్టుకు లాంచీలు నడుపుతారు.
శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగార్జునసాగర్ పరిధిలో కృష్ణానదీ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం గట్టుకు లాంచీలు నడుపుతారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం లాంచీ స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాగర్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్ వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. లాంచీ స్టేషన్ వద్ద సాగర్ పోలీసులు, ఏలేశ్వరం గట్టు వద్ద దేవరకొండ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.