ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన పాలి యూనివర్సిటీ విద్యార్థులు

by Kalyani |
ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన పాలి యూనివర్సిటీ విద్యార్థులు
X

దిశా, నాగారం: మండలంలోని పణిగిరి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని ముంబాయికి చెందిన పాలి యూనివర్సిటీ ఆర్కియాలజీ పురావస్తు డిపార్ట్మెంట్ కు చెందిన 100 మంది విద్యార్థులు ఆదివారం సందర్శించారు. ఫణిగిరి గుట్టపై ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని విద్యార్థులు పరిశీలించి అక్కడున్న మహాస్థూపాలు, చైత్యాలు, బౌద్ధ మండపాలు, శిలా సంపదను ఆనాటి వాస్తు శిల్పాలను కళారూపాలను అధ్యయనం చేశారు. దేశంలో గొప్ప బౌద్ధ క్షేత్రంలో ఒకటిగా ఉన్న ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని క్షేత్ర సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఆనాటి ఆర్కియాలజీ కట్టడాలపై అవగాహన కల్పించడం జరిగిందని పాలి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ యోజా భగత్ తెలిపారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించడానికి కనీస వసతులు ఏర్పాటు చేయాలని బౌద్ధ క్షేత్ర రక్షణ కోసం మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed