సాగులో ఒకరు.. పట్టాలో మరొకరు..

by Nagam Mallesh |
సాగులో ఒకరు.. పట్టాలో మరొకరు..
X

దిశ, నల్లగొండ బ్యూరో/తిరుమలగిరిః భూసమస్యలను పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నూతన ఆర్వోఆర్ -2024 చట్టాన్ని తీసుకవస్తుంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఐదు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో 15 రోజులుగా మండలంలోని భూములను సర్వే చేస్తున్నారు. ఫీల్డ్ మీదికి వెళ్ళిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. భూమిపై ఒకరు ఉండగా పట్టాలు వేరొకరి పేరుపై ఉంటున్నాయి. పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల కొత్తగా పాస్ పుస్తకాలు జారీ కాలేదు. 3900 ఎకరాల పైననే బోగస్ పట్టాలు అందినట్టు తెలుస్తుంది. చింతలపాలెం, తిమ్మాయపాలెం గ్రామ శివారులలో 2800 ఎకరాలకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు అక్రమార్కులకు అందాయి.దీంతో సర్వే చేపడుతున్న అధికార యంత్రాంగం నివ్వెర పోతుంది. తిరుమలగిరి సాగర్ మండలంలో మొత్తం భూములు 48 716.06 ఎకరాల భూములు ఉన్నాయి.. వీటిలో ఐదు రకాల భూములు ఉన్నాయి.

ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన అధికారుల తీరు మారకపోవడంతో కృష్ణపట్టి ప్రాంతం రైతుల పోడు గోడు తీరడం లేదు. నేటికీ ఈ సమస్య జఠిలంగానే ఉంది.పోడు భూముల సమస్యలకు నిలయంగా తిరుమలగిరి (సాగర్) మండలం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని భూ సమస్యలు ఈ మండలంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన అధికారులలో మార్పు రాకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసి నిలిచిపోయాయి. మండలంలో అధికారులు మారుతున్న కొద్ది ఉన్న సమస్యలకు కొత్త సమస్యలు సృష్టించారనే ఆరోపణలు రైతుల నుంచి వెళ్లు వెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో పాత పట్టా పాసు పుస్తకాలు స్థానంలో కొత్త పట్టా పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు. మండలంలోని ఆయకట్టు ప్రాంతంలో పట్టా పాస్ పుస్తకాల మార్పులో కొద్దీ సమస్యలే ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతాలలోని కృష్ణపట్టిలో మాత్రం సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూమి సాగుపై పేద రైతు ఉండగా.. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరికి పట్టాలు అందాయి.గత ప్రభుత్వం హాయంలో అధికారులు అక్రమార్కుల మధ్య లక్షలలో చేతులు మారి పట్టాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.భూములు లేకపోయినా పట్టాలు మాత్రం చేసినట్లు బట్టబయలవుతున్నాయి.భూములు లేకపోయినా పట్టాలు చేసిన అధికారుల పై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తాత్సర్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

మండలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం భూములు....

తిరుమలగిరి సాగర్ మండలంలో మొత్తం భూములు 48 716.06 ఎకరాల భూములు ఉన్నాయి.. వీటిలో ఐదు రకాల భూములు ఉన్నాయి.

-మండలం లో ప్రభుత్వ భూమి 14 గ్రామాలలో 12130.13 మొత్తం ఎకరాలు 298 సర్వే నెంబర్ లలో ఉంది..

-14 గ్రామాలలో 4125 సర్వే నెంబర్ లలో 12412.27 ఎకరాల పట్టా భూమి ఉంది..

- మండలంలోని 10 గ్రామాలలో 5 సర్వే నెంబర్ లలో 21183.38 ఎకరాల అటవి భూమి ఉంది..

- 2799 ఎకరాల తరలింపు భూమి 10 సర్వే నెంబర్ లలో రెండు గ్రామాలలో ఉంది..

-ఆరు దేవాలయాలకు190 ఎకరాల భూములు 6 గ్రామాలలో ఉంది.

మొత్తం మండలంలో 48716.06 ఎకరాల భూములు ఉన్నాయి..

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఐదు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో గత 15 రోజులుగా మండలంలోని భూములను సర్వే చేస్తున్నారు. ఫీల్డ్ మీదికి వెళ్ళిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.భూమి పై ఒకరు ఉండగా పట్టాలు వేరొకరి పేరు పై ఉంటున్నాయి. పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల కొత్తగా పాస్ పుస్తకాలు జారీ కాలేదు.3900 ఎకరాల పైననే బోగస్ పట్టాలు అందినట్టు తెలుస్తుంది. చింతలపాలెం,తిమ్మాయపాలెం గ్రామ శివారులలో 2800 ఎకరాలకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు అక్రమార్కులకు అందాయి.దీంతో సర్వే చేపడుతున్న అధికార యంత్రాంగం నివ్వెర పోతుంది.

భూ సమస్యలు ఇలా...

మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామపంచాయతీలు ఉండగా ఒక్క చింతలపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న భూ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.సుమారు 7000 ఎకరాల భూమికి పట్టాలు అందించాల్సి ఉంది.12,600 ఎకరాలు ఫారెస్ట్ భూమిలో సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది.11 వేల ఎకరాల ప్రభుత్వ భూమి పెండింగ్లో వుంది.గిరిజన ప్రాంతాలు ఎక్కువగా నివసిస్తున్న చింతలపాలెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 12,222,158,160,162,223.తిమ్మాయిపాలెం గ్రామంలోని సర్వే నెంబర్లు 38,39,60,70,74.తునికి నూతల గ్రామంలోని సర్వే నెంబర్లు 24,45/103.నెల్లికల్,ఎర్ర చెరువు తండ గ్రామాలలోని సర్వే నెంబర్లు 299,424.చెన్నాయి పాలెం గ్రామంలోని సర్వే నెంబర్లు 37,38.నాగార్జున పేట గ్రామంలోని సర్వేనెంబర్ 12,అదేవిధంగా నేతాపురం,డొక్కల బాయితండా,ఎల్లాపురం తండాలలో అనేక భూ సమస్యలు ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చినట్టు సమాచారం.ఈ ప్రాంతాలలో ప్రభుత్వ,ఫారెస్ట్,కాందేశీకుల భూములలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.భూమి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు అందలేదు.అసలు భూమిలేని వారికి పట్టాలు అందాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో 1964 కు ముందు సాగులో ఉన్నవారికి పట్టాలు ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు.నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం చేపట్టిన ప్రాంతం నుంచి నాగార్జున పేట,ఎర్ర చెరువు తండా,తునికి నూతల,సుంకిశాల తండా గ్రామాల నుంచి వలసలు వచ్చిన వారికి ఆనాడు ప్రభుత్వం కొంత భూమిని సాగు హక్కు కల్పించి పట్టాలు అందజేశారు.అందులో కొందరికి పాతవాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు అందాయి.మరికొందరికి పట్టాలు నేటిగా అందనేలేదు -

"తునికి నూతల గ్రామ శివారు భూమిలో సర్వేనెంబర్ 24,44,45/103 లలో సుమారు 300 ఎకరాలు భూమి ఒక వీఆర్ఓ పేరు మీద ఉందని".. సేద్యంలో మాత్రం పేద రైతులు ఉన్నారని కలెక్టర్ ఆధ్వర్యంలో చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన భూ సమస్యల సమావేశంలో తునికినూతల గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.రాజకీయ నాయకులు,అధికారుల అండదండ ఉన్న నాయకులు చాలా ఎకరాలలో కబ్జాలు చేసి పట్టాలు పొందినట్టు తెలుస్తుంది

- మాకు పట్టాలు ఇప్పించండి

- రమావత్ రమేష్ నాయక్ (ఎర్రచెరువు తండ) :

మా గ్రామంలోని సర్వేనెంబర్ 424 లో గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య భూవివాదం నడుస్తుంది.1953 నుంచి 1997 వరకు ఈ సర్వే నెంబర్లో గిరిజనులైనా మా తాత ముత్తాతలకు పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నయి.కానీ కొత్త పాస్ పుస్తకాలు రాలేదు.సాగు చేసుకుంటున్న మా గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారు.దీని విషయంలో 2022 సంవత్సరంలో మా గిరిజనుల పై ఎఫ్ఐఆర్ నమోదయింది.దీంతో కోర్టును ఆశ్రయించాం.ఈనెల 27న కోర్టు తీర్పు ఇవ్వనుంది.సాగు చేసుకుంటున్న పేద రైతులమైన మాకు ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలి

-- సాగు చేసుకుంటున్నాం.. పట్టాలు లేవు..

పెదమాము కాశయ్య (చింతలపాలెం రైతు)

చింతలపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాం.కానీ నేటికీ చాలామందికి పట్టాలు రాలేదు.కొందరికి మాత్రమే పట్టాలు అందజేశారు.నాది 223 సర్వే నెంబర్ లోని నాలుగు ఎకరాల 19 గుంటలు భూమికి పట్టా నేటికీ అందలేదు.గత రెండు సంవత్సరాల క్రితం అధికారులు సర్వే చేశారు.ఈ విషయంపై ఎమ్మార్వో అడగగా ఆ సర్వే నెంబర్లో ఖాళీ భూమి లేదన్నారు.మిగతా రైతులకు ఆ భూమిలో పట్టాలు ఉన్నాయని తెలిపారు.మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.పట్టాలు ఇప్పించాలి.

Advertisement

Next Story

Most Viewed