- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాలకు చెరువులే ప్రాణాధారం..
దిశ, చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను పటిష్ట పరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి పనులను మొదలుపెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాదులోని తన నివాసంలో మునుగోడు నియోజకవర్గ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూమి మీదనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసి ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని, ఇక్కడ కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్ళించినట్లయితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం కొంత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 669 చెరువుల్లో గొలుసుకట్టు చెరువులకు నీరు వచ్చే ఫీడర్ ఛానల్ లను పటిష్టం చేయడంతో పాటు ఆయా చెరువులలో పేరుకుపోయిన పూడికను తీయడం, కట్టలను పటిష్టం చేయడం లాంటి పనులను విడతల వారీగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు.
దాని కోసం డిసెంబర్ నెలలో చెరువులను పటిష్టం చేయడానికి సైట్ సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే పని పూర్తి చేయాలన్నారు. జనవరి నుండి జులై వరకు ఆరు నెలల్లో ఎంపిక చేసిన చెరువులను పటిష్టం చేయాలన్నారు. వర్షాకాలం రావడానికి ముందే చెరువులను పటిష్టపరిచేలా ప్రణాళికలు ఉండాలని కోరారు. భూగర్భ జలాలను పెంచడానికి చెరువులతో పాటు వాగుల పై ఎన్ని చోట్ల మత్తడి (మట్టితో నిర్మించే మినీ చెక్ డ్యాం) నిర్మాణాలు చేపట్టాలి, వాగుల పై ఎన్ని చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలి, వెల్మకన్నే, శేషులేటి వాగు ఫీడర్ ఛానల్ పనుల పునరుద్ధరణ, గొలుసు కట్టు చెరువులతో పాటు మిగతా చెరువులలో నీటిని నింపడానికి కావలసిన వనరులను, చేపట్టాల్సిన పనుల పై ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు. మండలాల వారిగా కమిటీలు ఏర్పాటు చేస్తానని, ఆ కమిటీల ద్వారా నీటిపారుదల అధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాకాలం వచ్చే సమయానికి ఎంపిక చేసిన చెరువులను నిర్దేశిత సమయంలో పూర్తిచేసేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. విడతల వారీగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 669 చెరువులను పటిష్ట పరచాలన్నారు. ఈ సమీక్షలో నియోజకవర్గంలోని ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.