- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ ఉత్తమ్ పై ఘటన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
దిశ, నేరేడుచర్ల: హుజూర్నగర్ నియోజకవర్గంలో కొత్త వారు ఎవరు రాజకీయాల్లోకి రాకుండా భయపెట్టాలని చూస్తున్నారన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఉత్తమ్ అనుచరులు చేస్తున్న అరాచకాలను ఇక సహించేది లేదన్నారు. మా వాళ్లను టచ్ చేసి చూడు.. నీ సంగతి చూస్తామని సైదిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని రామాపురం టీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయన్నారు. వాళ్ల బెదిరింపులకు ఏనాడు బెదిరేది లేదని అలా అని మా పార్టీ కార్యకర్తలు నాయకుల జోలికొస్తే ఒక్కొక్కడి తాట తీస్తామని ఇంకోసారి మా వాళ్ళ గురించి ఆలోచించాలంటేనే భయపడే విధంగా చేస్తామని.
20 ఏండ్లు ఇక్కడ రాజకీయం చేస్తూ సొంత ఇల్లు కూడా లేని ఉత్తమ్ అని వ్యాఖ్యానించారు. ఎంతసేపు తాను తన భార్యకు ఎమ్మెల్యే పదవులు కావాలని తప్ప మరి ఏ ధ్యాస లేదని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా వాటిని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప మరే ఆలోచన ఉత్తమ్‌కు లేదన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు జరిగిన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ 70 వేల మెజార్టీతో గెలుపొందుతుందని సర్వేలు స్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారు మున్సిపల్ చైర్మన్ జయబాబు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె వి రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.