- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నూతనకల్‌లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ రోడ్ షో

X
దిశ, నూతనకల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ నూతనకల్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల దాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story