గంజాయి రవాణా ముఠా సభ్యుల అరెస్ట్..

by Sumithra |
గంజాయి రవాణా ముఠా సభ్యుల అరెస్ట్..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం అక్రమ గంజాయి రవాణా ముఠా సభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసులు ముకుమ్మడిగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రెండు కార్లలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి భువనేశ్వర్ మీదుగా హైదరాబాదుకు ఒక షిఫ్ట్, ఒక మహేంద్ర థార్ అనే రెండు కార్లలో "కాంట్రా బ్యాండ్" గంజాయిని రవాణా చేస్తున్నారని స్థానిక పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ మేరకు ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టడంతో గంజాయి రవాణా ముఠా సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన వారిలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ఎర్రగుంట టూర్ కాలనీకి చెందిన కారు డ్రైవర్ ఇమ్రానుద్దీన్ అలియాస్ అలీముద్దీన్ (32), హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన అబ్దుల్ ఆసిఫ్(26), మోసిన్ ఖాన్ (26), హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అమీర్ (26), సంతోష్ నగర్ కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ (24)అనే నిందితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయి, 2 కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు. నిందితులు ఐదుగురి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.

Next Story

Most Viewed